తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Devarakonda : ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా.. గురుకుల హాస్టల్లో అదనపు ఎస్పి ఆరా..!

Devarakonda : ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా.. గురుకుల హాస్టల్లో అదనపు ఎస్పి ఆరా..!

దేవరకొండ, మన సాక్షి :

దేవరకొండ మండలం పెంచికల్ పహడ్ లో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన అడిషనల్ ఎస్పి పి.మౌనిక… హాస్టల్‌లో వసతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా..? అంటూ దేవరకొండ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను అడిషనల్ ఎస్పీ ఆరా తీశారు.

పాఠశాల ఆవరణ అంతా కలియ దిరిగారు. వంటలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థినులకు పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు.

శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. చదువు పట్లకూడ శ్రద్దతో చదివి మంచి ఫలితాలు పొందాలని సూచించారు. స్థానిక సిబ్బంది చదువులో పిల్లల పట్ల శ్రద్ద వహించాలని పేద పిల్లలు ఉంటారు.

చదువు రాని తల్లీ తండ్రులు ఉంటే వారికి అవగాహన కల్పించి చదువులో ముందు వరుసలో ఉండున్నట్లు పురిగోల్పి వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుటకు సహకారం అందించాలని ఈ మేరకు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవరకొండ ఎస్సై అజ్మీరా రమేష్ , పాఠశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. SLBC : SLBC టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కిన చోటు.. లేటెస్ట్ విజువల్స్..!
  2. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్..!
  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!
  4. Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
  5. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

మరిన్ని వార్తలు