TOP STORIESBreaking Newsఉద్యోగంఖమ్మం జిల్లావ్యవసాయం

Crop Survey : డిజిటల్ క్రాప్ సర్వే కు సాంకేతిక సమస్యలు..!

Crop Survey : డిజిటల్ క్రాప్ సర్వే కు సాంకేతిక సమస్యలు..!

నేలకొండపల్లి, మన సాక్షి ;

పంటల సాగును ఖచ్చితంగా లెక్కించేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే గత మూడు రోజుల నుంచి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ప్రారంభమైంది. అత్యంత కఠినమైన ఈ సర్వే చేయడం తమ ఒక్కరితో కాదని సహాయకులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవో) లు నెల రోజులుగా సర్వేకు దూరంగా ఉన్నారు.

ఇటీవల రైతు భీమా లో మార్గదర్శకాలు పాటించలేదని 165 మంది ఏఈవో లను సస్పెండ్ చేయడం ద్వారా వారిపై మానసికంగా ఒత్తిడి పెంచిన ప్రభుత్వం సర్వే చేసేలా చేసింది. సస్పెన్షన్ పై ఆందోళన చెసిన ఏఈవో లతో చర్చించిన వ్యవసాయ శాఖ డైరెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని సర్వే చేపట్టాలని సూచించారు.

దీంతో వారు సర్వేను చేపట్టారు. గత నెల 24 నుంచి చేపట్టాల్సిన సర్వే ఈ నెల నుంచి మొదలైంది. మొబైల్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకుని క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంటలు నమోదు చేస్తున్నారు.

అయితే ఫిల్డ్ లో చాలా రకాల సమస్యలతో ఏఈవో లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గ్రామాలకు దూరంగా ఉన్న పొలాలకు తోడులేకుండా వెళ్లి సర్వే చేయాలంటే మహిళా ఏఈవో లు జంకుతున్నారు.

సాంకేతిక సమస్యలతో సతమతం :

సర్వేలో ఏఈవో లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు దాటుకుంటూ పంటపొలాల దెగ్గరకు వెళ్ళవలసి వస్తుంది. తీరా వెళ్లిన తర్వాత అక్కడ నెట్వర్క్ సమస్య తలెత్తుతుంది. ఒక సర్వే నెంబర్ దగ్గర వేరే రైతు వివరాలు చూపించడం లాంటిది జరుగుతోంది.

పంట వివరాలను నమోదు చేసి ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి సమస్యలు తలెత్తడంతో వెళ్లిన పొలం వద్దకే వెళ్లాల్సి వస్తోంది.

పొలాలకు వెళ్లే దారులు సరిగా లేక కిలోమీటర్ల మేర దూరం నడిచి వెళ్ళటం కరెంటు తీగలు, పాములు, ఇలా అనేక రకాల సమస్యలతో ఏఈవో లు బిక్కుబిక్కుమంటూ సర్వే నిర్వహిస్తున్నారు. తమ ఇబ్బందులను అర్థం చేసుకొని న్యాయం చేయాలని ఏఈవో లు కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు