TG News : అరుణాచల్‌ప్రదేశ్ వేదికగా అదరగొట్టిన తెలంగాణ బ్యాడ్మింటన్ బాలికలు..!

TG News : అరుణాచల్‌ప్రదేశ్ వేదికగా అదరగొట్టిన తెలంగాణ బ్యాడ్మింటన్ బాలికలు..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :
అరుణాచల్‌ప్రదేశ్ వేదికగా జరిగిన అండర్–19 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలికల జట్టు అదరగొట్టింది. దేశం నలుమూలల నుంచి ఎంపికైన ప్రతిభావంతుల మధ్య జరిగిన ఈ పోటీల్లో ఆరంభం నుంచే దూకుడు చూపిన రాష్ట్ర జట్టు ఫైనల్స్‌లో ఢిల్లీపై విజయం సాధించి పసిడి పథకాన్ని అందుకుంది.
బాలుర విభాగంలో కూడా తెలంగాణ జట్టు చెలరేగి కాంస్య పథకం సాధించింది. జాతీయ స్థాయిలో రెండు విభాగాల్లోనూ ప్రభావంతమైన ప్రదర్శనతో తెలంగాణ బ్యాడ్మింటన్ ప్రతిభ మరోసారి మెరుపు విరజిమ్మింది. ఈ విజయాలపై రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ క్రీడాకారిణులను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో సాధించిన ఈ విజయాలు బ్యాడ్మింటన్‌లో తెలంగాణకు జాతీయస్థాయిలో మరింత గౌరవం తెచ్చాయని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి మరింత మంది జాతీయ–అంతర్జాతీయ ఛాంపియన్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
MOST READ :
-
TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)
-
ACB : లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సర్వేయర్..!
-
Union Minister : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన.. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ..!
-
Gold Price : బంగారం ధర ఒకేరోజు భారీగా రూ.17 వేలకు పైగా తగ్గింది.. కొనుగోళ్లకు ఇదే మంచి సమయం..!









