TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!

Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, 500 రూపాయలకే వంట గ్యాస్, రైతుల రుణమాఫీ తో పాటు ఆరోగ్యశ్రీ పెంపు నిర్వహించారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో శుభవార్త తెలియజేశారు. పేదలకు, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. శనివారం నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ లో జరిగిన రెవెన్యూ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గతంలో చెప్పినట్లుగానే పేద ప్రజలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, నెలాఖరులోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు మొదటి విడతన 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 5000 ఇండ్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు.

గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి సర్టిఫికెట్లు లేక బ్యాంకులో మార్ట్గేజ్ లో ఉన్న వాటిని ఆ మార్ట్ గేజ్ అప్పు నిలిపివేసి లబ్ధిదారులకే ఆ ఇండ్లు సొంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై గృహనిర్మాణ శాఖలో ఉన్న హక్కు పత్రాలు పెండింగ్ లో ఉన్నాయని, ఆ పెండింగ్ ను క్లియర్ చేసి లబ్ధిదారులందరికీ ఆ హక్కు పత్రాలు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు