Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!

Ration Cards : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై వారికి రేషన్ కట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ తీసుకోని వారికి ఇకపై రేషన్ కట్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సర్వే చేపట్టింది. రేషన్ కార్డు లబ్ధిదారులు ఆరు మాసాలుగా రేషన్ తీసుకోకుండా ఉన్న వారి జాబితాను సిద్ధం చేసింది.
వారికి రేషన్ బియ్యం కంటే ఇతర ప్రయోజనాలు ముఖ్యమని గుర్తించింది. అలాంటి వారి లిస్ట్ తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించింది. రాష్ట్రవ్యాప్తంగా 76,000 మంది పైగా 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని తేలింది.
రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలోని ఉన్నట్లు సర్వేలో వెళ్లడైంది. ఆరు మాసాలుగా రేషన్ తీసుకోవడం లేదనే విషయంపై విచారణ జరిపి ఇకపై వారికి రేషన్ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ తీసుకోని వారిలో కొంతమంది చనిపోయిన వాళ్లు, మరికొంతమంది డబుల్ ఎంట్రీ ఉన్నవాళ్లు ఉన్నట్లు కూడా తెలిసింది.
MOST READ :
-
TG News : భారీగా తగ్గనున్న ఎంపిటిసి స్థానాలు.. స్థానిక సంస్థల లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు రిజర్వ్..!
-
TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!
-
Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో రూ.48 వేలు ఒకేసారి.. రైతుభరోసా మీకు రాలేదా.. వెంటనే ఇలా చేయండి..!
-
Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!









