Telangana : ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం.. కోదండరామ్ కు కీలక పదవి..!
Telangana : ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం.. కోదండరామ్ కు కీలక పదవి..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ శాసనమండలి సభ్యులుగా తెలంగాణ ఉద్యమ రధ సారధి ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిజంలో విశేష సేవలందించిన అమీర్ అలీ ఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక ప్రెసిడెంట్ ఎడిటర్ అలీ ఖాన్ కుమారుడు) ప్రమాణ స్వీకారం చేశారు.
కోదండరాం విషయంపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు శుక్రవారం వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ హాజరయ్యారు.
ఉద్యమ రథసారధి కోదండరాం :
ముద్దసాని కోదండ రామ్ రెడ్డి స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నంద్యాల మండలం జోగాపూర్. ఆయన ముద్దసాని వెంకటమ్మ జనార్దన్ రెడ్డిలకు 1955 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ, ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్టీయూలో ఎంపిల్ పూర్తి చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి లో చేరగా 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడంతో ఆయన పిహెచ్డిని మధ్యలోనే మానేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా సుదీర్ఘకాలం ఆయన పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్ గా ఉద్యమాన్ని నడిపించారు.
రాష్ట్ర సాధన కోసం ఆయన క్రియాశీలకంగా పని చేశారు. 2018 లో మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసుతో కలిసి పోటీ చేశారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే జతకట్టారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
అమీర్ అలీ ఖాన్ :
ఇతను జర్నలిజంలో విశేష సేవలు అర్థించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిసి ఏ, సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుత ఆయన సియాసత్ న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ప్రధానమంత్రి, రాష్ట్రపతి వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. మైనార్టీలలో విద్యా నైపుణ్య అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ఇతని కృషితో ఖతర్ దేశాన్ని కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18లో హైదరాబాదులో జన్మించిన అమీర్ అలీ ఖాన్ ఉర్దూ తో పాటు ఇంగ్లీష్ , అరబిక్ , తెలుగు భాష కూడా తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను చదివారు.
కోదండరాం కు కీలక పదవి :
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాంకు తెలంగాణ మంత్రి వర్గంలో కీలక పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీలను కలిపి జేఏసీ చైర్మన్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. దాంతో పాటు మంత్రివర్గంలో కూడా కీలక పదవి ఇవ్వాలని ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.
ALSO READ :
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!
మీకు జీరో కరెంటు బిల్లు రావట్లేదా.. అయితే వారికోసం ఓ గుడ్ న్యూస్..!









