తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలండర్ ఆవిష్కరణ..!

Nalgonda : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలండర్ ఆవిష్కరణ..!

నల్లగొండ, మనసాక్షి.

తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2025 నల్లగొండ సూర్యాపేట జిల్లాలకు చెందిన క్యాలెండర్ను ఆదివారం స్థానిక ఎల్ పి టి మార్కెట్ లోని ఆ సంఘం భవనంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరి లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని పద్మశాలీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంను ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులు ఉపయోగించుకోగలరని మరియు దీనిద్వారా ఉద్యోగులకు మరియు పద్మశాలీలకు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నాము అని, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది దీని ద్వారా లబ్ది పొందుతున్నారు.

మరియు ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు, ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు, పేదవారిని ఆడుకోవటం లాంటి కార్యక్రమాలులతో పాటుగా అన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరో లు నిర్వహిస్తున్నాము అని మరియు సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఉద్యోగులు సహాయ సహకారాలతో వారు నిర్వహిస్తున్నాము అని, ఇట్టి రాష్ట్ర పద్మశాలి సంఘానికి స్వంత కార్యాలయ భవనం కూడా హైదరాబాద్ లో కల్గి వున్నది అని వారు తెలిపారు.

సంఘం నల్లగొండ , సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు నల్ల శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి యేశాల విశ్వకుమార్ గార్లు మాట్లాడుతూ ఈ సంఘం ద్వారా పేద విద్యార్థులను ఆదుకోవటం తో పాటుగా పలు సేవా కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నాము అని, వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి వివాహ సంబంధాలను కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా కుదురుస్తున్నాము అని, ఇట్టి వివాహ పరిచయ వేదికలో ఒక్కసారి పేరు నమోదు చేసుకున్నచో వా వీరికి వివాహం కుదిరేవరకు ఎన్ని ప్రొఫైల్స్ అయినా అన్ లిమిటెడ్ గా చూసుకోవచ్చు అని తదుపరి ఎటువంటి కమీషన్లు గానీ బహుమతులు గానీ స్వీకరించబడవు అని పద్మశాలీల అభివృద్ధికై కృషి చేస్తున్నాము అని వారు తెలిపారు.

అలాగే ప్రతి ఆదివారం ఈ సంఘ కార్యాలయంలో వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నాము అని, ఆన్లైన్ ద్వారా కూడా ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అని వారు తెలిపారు.

కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి శ్రీ తిరందాసు యాదగిరేందర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయి రాజ్, పద్మశాలి ప్రాంత సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు, బి.సి. సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మినారాయణ, పెండెం శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంజి వెంకట శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ చిలుకూరి వెంకటేశం, కోశాధికారి మిర్యాల వేంకటపతి, ప్రచార కార్యదర్శి నవీన్ కుమార్ లతో పాటుగా కమీటీ సభ్యులు నక్క జ్ఞానేశ్వర్, రాపోలు రవి, సంగిశెట్టి హరికృష్ణ, నీలం సుధాకర్, పొట్టాబత్తుల జ్యోతి, మిర్యాల శ్రీనివాస్, వేషాల శ్రీదేవి, గంజి వెంకన్న, గంజి నారాయణ, గడ్డం శ్రీనివాస్, మాకం గణేష్,

గంజి ధనంజయ, ఏశాల శివ, ఆనందపు సత్యనారాయణ, పున్న వేణుగోపాల్, దొంత దామోదర్, తిరందాసు సంతోష్ కుమార్, రాపోలు అశోక్, గంజి ఉపేందర్, చిలుకూరి గోవర్ధన్, ఏలే శ్రీకాంత్, రాపోలు క్షీర సాగర్, గోశిక శివ కుమార్, దునుక జగదీశ్వర్, జల్ద శ్రీనివాస్, కొంగరి పాండు, మిర్యాల శ్రీనివాస్ లతో పాటు నల్లగొండ సూర్యాపేట జిల్లాల పద్మశాలి ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు