తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

District collector : తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ లోగో ఉపయోగించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..! 

District collector : తెలంగాణ రైజింగ్ నంబర్ వన్ లోగో ఉపయోగించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..! 

నల్లగొండ, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుండి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రభుత్వం ఆమోదించిన ప్రజా పాలన విజయోత్సవాల అధికారిక లోగోను అన్ని ప్రింట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ప్రజా పాలనపై సమీక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “తెలంగాణ రైజింగ్ నంబర్ వన్” లోగోను అన్నిచోట్ల, అందరికీ బాగా కనిపించే విధంగా ప్రదర్శించాలన్నారు.

అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో, ఛాంబర్లలో నెంబర్ వన్ లోగో స్టాండీస్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు .ఆయా శాఖల వారిగా గత సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధిపై విజయ గాథలను రూపొందించి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని, పోస్టర్లు, కరపత్రాల రూపంలో ప్రచారం చేయాలని చెప్పారు.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ప్రజా విజయోత్సవాలను జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులను, ప్రజలను ,అధికారులను భాగస్వామ్యం చేస్తూ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాల్సిందిగా ఆమె ఆదేశించారు.

ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని, అంతేకాక 2 కె రన్ లను నిర్వహించడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కళాశాలలను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని, అలాగే 213 కొత్త అంబులెన్స్లను, 33 ట్రాన్సజెండర్ క్లినిక్లను జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించనున్నారని తెలిపారు.

డిసెంబర్ 3న మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, పట్టణ ప్రాంతాలలో అన్ని కార్యాలయాల్లో విద్యుత్ దీపాల అలంకరణ, వైద్య శిబిరాల నిర్వహణ ,పారిశుధ్య కార్మికులకు కిట్ల పంపిణీ ఉంటుందని తెలిపారు.

డిసెంబర్ 4న అమృథ్ పనుల ఫౌండేషన్, పెద్దపల్లిలో 9007 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. డిసెంబర్ 5న పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా నల్గొండ తో పాటు ,మేడ్చల్, మల్లేపల్లిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాల ప్రారంభం ఉంటుందని తెలియజేశారు.

డిసెంబర్ 6 న యాదాద్రి పవర్ స్టేషన్ కమిషనింగ్, 2004 సబ్ స్టేషన్ లో శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని, డిసెంబర్ 7న హైదరాబాదులో
రాష్ట్ర విపత్తు నిర్వహణ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం ,పోలీస్ బ్యాండ్ ప్రదర్శన, ప్రజా పాలన గ్రాండ్ ఫినాలే ఉంటాయని తెలిపోయారు.

డిసెంబర్ 8 న హైదరాబాదులో పారిశ్రామిక శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయని,
డిసెంబర్ 9న హైదరాబాద్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, డ్రోన్ షో, ఫైర్ షో ఉంటాయని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్ఓ అమరెందర్, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు