TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!

TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఎంతో ఆలస్యం అయినందున ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఏప్రిల్ 1 నుంచి 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకుంది. జూన్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.
బీసీలకు విద్యా ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభ ఇప్పటికే ఆమోదం చేయడం జరిగింది. ఇలా ఉండగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, బిసి, ప్రజా సంఘాలతో కలిసి ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కూడా కలిసి బీసీ రిజర్వేషన్లపై విజ్ఞప్తి చేయనున్నారు.
సర్పంచ్ ఎన్నికలు ఏడాది దాటినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు ఆగిపోయాయి. మొత్తం 1500 కోట్ల పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే పాలకవర్గాలు కొలువు దీరితేనే ఈ నిధులు వచ్చే అవకాశం ఉంది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి. దాంతో ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి.
అంతేకాకుండా మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలలో కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి పదవుల కోసం పార్టీ క్యాడర్ ఎదురుచూస్తుంది. గ్రామాలలో పార్టీని బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.
Similar News :
-
Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కారణం అదేనా..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు 10న నోటిఫికేషన్.. మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికలు..!
-
Panchayat Elections : గ్రామపంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!
-
Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!









