తెలంగాణBreaking Newsఉద్యోగం

TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

మన సాక్షి , హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 6729 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ పొందాక కూడా కాంట్రాక్టు పద్ధతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6729 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం తొలగించిన జాబితాలో మెట్రో రైల్ ఎండి NVS రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ కిషన్ రావు తో పాటు కన్సల్టెంట్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి కూడా ఉన్నారు. పదిమంది ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు.

వారి స్థానాల్లో కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఉద్యోగాలు భర్తీ చేయడం, పదోన్నతులు కల్పించడంపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించింది. మేరకు ఆయా శాఖలో ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

మునిసిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీరిని వెంటనే తొలగిస్తూ అవతరణ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6729 మందిని తొలగించడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 4 స్థాయిలో కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.

MOST READ : 

  1. Electricity Bill : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. జారీ చేసిన CMD..!

  2. Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

  5. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

మరిన్ని వార్తలు