తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంక్షేమంసూర్యాపేట జిల్లా

TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

TG News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త..! 

హుజుర్ నగర్, (మనసాక్షి):

పేద ప్రజలకు రేషన్ ద్వారా పంపిణీ చేసే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఉగాది (ఈ నెల 30) రోజున అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఈ పథకానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండలంలోని మట్టపల్లి గ్రామం వేదికగా, అక్కడి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతన పంచాంగాన్ని విడుదల చేయనున్నారు.

ఇక, ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా 30,000 మంది మహిళలు హాజరయ్యే భారీ బహిరంగ సభ కూడా మట్టపల్లిలో ఏర్పాటు చేయనున్నారు.గత 16 నెలలుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే, ఇప్పుడు తొలిసారిగా అధికారికంగా ఈ నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  2. TG News : మహిళలకు తులం బంగారం.. నెలకు రూ.2500లపై బిగ్ అప్డేట్..!

  3. TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!

  4. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  5. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు