Telangana : విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. దసరా నుంచి అమలు..!
Telangana : విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. దసరా నుంచి అమలు..!
హైదరాబాద్ , మనసాక్షి : తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది.
ఆ పథకాన్ని దసరా నుంచి పాఠశాలల్లో అమలు చేసేందుకు నిర్ణయించారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు (ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు) చదువుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ ను తెలియజేశారు.
ALSO READ :
TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!
వారందరికీ అల్పాహార పథకం ను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దసరా కానుకగా అక్టోబర్ 24 వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు చక్కటి విద్యా బోధనతో పాటు పోషకాహారం కూడా అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం కూడా అందించటం వల్ల నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం అందనున్నది. దానివల్ల విద్యార్థులు విద్యపై ఏకాగ్రత పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఉదయం వేళలో వ్యవసాయ పనులకు, కూలి పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ ఆలోచన వల్ల అల్పాహార పథకాన్ని అమలు చేయాలని భావించారు. విద్యార్థులకు అల్పాహారం పథకం తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలు అవుతుంది.
ALSO READ :
Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
ఈ పథకాన్ని పరిశీలించి న ఐఏఎస్ అధికారుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక అందజేశారు. తమిళనాడులో ఈ పథకం అమలవుతున్న తీరు చన్నులపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కి నివేదిక అందజేయడంతో తెలంగాణలో కూడా అమలు చేయాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కే కాకుండా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా అల్పాహారం అందజేయాలని నిర్ణయించారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా 400 కోట్ల రూపాయల అదనపు భారం పడనున్నది. అయినా కూడా విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
ALSO READ :
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!










