Chess : చెస్ లో పదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం..!
Chess : చెస్ లో పదేళ్ల చిన్నారి ప్రపంచ రికార్డు.. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
180 చదరంగం బోర్డులపై ఏకధాటిగా.. అత్యంత వేగంగా పావులు కదుపుతూ…కేవలం 9నిముషాల41సెకను లలో చెక్ మేట్ లు పెట్టి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు మిర్యాలగూడ పట్టణానికి చెందిన 10 సంవత్సరాల చిన్నారి గుండా కార్తికేయ.
గతంలో ఇదే సమస్యను 11:59 నిమిషాలలో పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించిన నారా దేవాన్స్ రికార్డును బ్రేక్ చేస్తూ కార్తికేయ ఈ ఘనతను సాధించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించాడు. మిర్యాలగూడ పట్టణం లోని మహా టీవీ రిపోర్టర్ గుండా మహేష్, చంద్రకళ దంపతుల కుమారుడైన 10ఏళ్ల కార్తికేయ స్థానిక సంస్కృతి పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్ పల్లి లో డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంపిటీషన్ లో ఈ ఘనత సాధించాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులుగా అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు ఆశ, అంకిత్ గౌడ్, అరవింద్ ల సమక్షం లో ఏర్పాటుచేసిన ప్రతిభా పరీక్ష లో 9:41 నిమిషాలలో ఘనత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతని ప్రతిభను గుర్తిస్తూ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ ధ్రువీకరణ సర్టిఫికెట్,రివార్డు ను అందజేశారు.
చిన్నతనం నుండే చెస్ క్రీడపై కార్తికేయ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఆన్లైన్ కోచింగ్ ఇప్పించారు. అనంతరం ఇటీవల మిర్యాలగూడ లో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి, కోచ్ మాశెట్టి దివ్యశ్రీ ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ అకాడమీలో నాలుగు నెలలుగా శిక్షణ పొందుతూ రాటుతేలాడు.
ఆటతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలి – బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ :
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయను ప్రత్యేకంగా అభినందించారు. ఆటలో మరింత నైపుణ్యం పొంది ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు. చిన్నారిని ప్రతిభావంతుడి గా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను, కోచ్ దివ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్ మాట్లాడుతూ చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు అకాడమీ నెలకొల్పిన దివ్యశ్రీని, ప్రపంచ రికార్డు సాధించిన కార్తికేయ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మాశెట్టి శ్రీనివాస్, గీత, పల్లి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
District Sp : ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!
-
Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!











