TG : రైతులకు భారీ శుభవార్త.. ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలలో జమ..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు అందజేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్రాలకు అందజేసే 40% సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది.

TG : రైతులకు భారీ శుభవార్త.. ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలలో జమ..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త తెలియజేసింది. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు అందజేసే వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద యంత్రాలకు అందజేసే 40% సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయాలని నిర్ణయించింది.
రైతులకు ట్రాక్టర్లు, ఇతర యంత్రాలపై 40 శాతం సబ్సిడీ నేరుగా కంపెనీలకు వెళ్లేది. దానివల్ల పారదర్శక లోపిస్తుందని ప్రభుత్వం భావించింది. ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. వాటి వల్ల రైతులకు నాణ్యమైన పనిముట్లు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలగనున్నది. దళారుల ప్రమేయం కూడా లేకుండా పోతుంది.
రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఖరీఫ్ సీజన్లో 60.60 లక్షల హెక్టార్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎరువుల కొరత, విత్తనాలు కొరత లేకుండా సిద్ధం చేయాలని సూచించారు.
ఏప్రిల్ నెలాఖరులోగా రైతులకు ఎరువులు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని అందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులు కూడా సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ ఆధునీకరణలో భాగంగా గ్రామాలలోని రైతు వేదికల ద్వారా రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధం కావాలని సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా రైతులకు సలహాలు ఇచ్చే విధంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.