Breaking Newsతెలంగాణరాజకీయం

TG : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాచీ లొల్లి.. కేటీఆర్, హరీష్ రావుకే కాదు, పెద్దాయనకు కూడా ఇవ్వడానికి సిద్ధం..!

వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాచీ లొల్లి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయన కోటి రూపాయల వాచీ పెట్టుకుని అసెంబ్లీకి హాజరయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారని, దానిని తనకు మిత్రుడు బహుమతిగా ఇచ్చారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

TG : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాచీ లొల్లి.. కేటీఆర్, హరీష్ రావుకే కాదు, పెద్దాయనకు కూడా ఇవ్వడానికి సిద్ధం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాచీ లొల్లి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయన కోటి రూపాయల వాచీ పెట్టుకుని అసెంబ్లీకి హాజరయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారని, దానిని తనకు మిత్రుడు బహుమతిగా ఇచ్చారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

వాచీ ధర కేవలం 10000 రూపాయల నుంచి 40000 రూపాయల లోపే ఉంటుందని తనకు తెలుసు అన్నారు. వారు ఆరోపించినట్లుగా కోటి రూపాయలు ధర ఉంటే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అంతేకాకుండా పెద్దాయన కేసీఆర్ కు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ విషయంపై మాట్లాడుతూ బీసీ నేత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వాచీ కోటి రూపాయలు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలు ట్రోలింగ్ చేస్తున్నారని, కానీ అతని వాచీ అంత ధర ఉన్నది అని అనిపిస్తే 20 వేలు కానీ 30 వేల రూపాయలు గాని ఇచ్చి వారే తీసుకోవచ్చు అని బంపర్ ఆఫర్ ప్రకటించారు. బీసీ నేత ఎదగడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు