Breaking NewsTOP STORIEStravelతెలంగాణహైదరాబాద్

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

Good News : ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. ఇకపై తొలగనున్న కష్టాలు..!

ManaSakshi :

తెలంగాణలో ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. పల్లె వెలుగు సిటీ బస్సులలో ఆన్లైన్ పేమెంట్ మోడ్ ను అతి త్వరలో అందుబాటులోకి తేలినట్లు ప్రకటించింది. ఆగస్టులోగా సిటీ బస్సు సర్వీసులలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సెప్టెంబర్ నాటికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అందుకుగాను ఆర్టీసీ కండక్టర్లకు ఐ- టీమ్స్ ను అందజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అంతే కాకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ప్రయాణ మిత్రులకు ఉచిత బస్సు సౌకర్యం కోసం స్మార్ట్ కార్డులను కూడా అందజేయనున్నారు. మహిళలు అందజేసే స్మార్ట్ కార్డును కండక్టర్ వద్ద ఉన్న మిషిన్ లో స్వైప్ చేయడం ద్వారా జీరో టికెట్లు పొందే అవకాశం కల్పించనున్నది. కొత్తగా ప్రవేశపెట్టి ఐ- టిమ్స్ లో డెబిట్ కార్డులను వినియోగించుకొని చెల్లింపులు కూడా చేయవచ్చును. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా యూపీఐ పేమెంట్ చేసే వెసులుబాటు కల్పించనున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ సిటీలో బండ్లగూడ, దిల్ సుఖ్ నగర్ సిటీ బస్సు లకు ఐటమ్స్ ను పైలెట్ ప్రాజెక్టు కింద అందజేశారు. ఆ బస్సులలో యూపీఐ పేమెంట్స్ కొనసాగుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ముందుగా హైదరాబాదులోని సిటీ బస్సులకు ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల బస్సులకు కూడా ఆన్లైన్ పేమెంట్ మోడ్ ను అమలు చేయనున్నారు. దాంతో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తొలగనున్నాయి.

ఇవి కూడా చదవండి : 

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

BREAKING : ఉపాధ్యాయురాలుగా మారిన జిల్లా కలెక్టర్.. ఎందుకు అలా, తెలుసుకోవాలని ఉందా..! 

మరిన్ని వార్తలు