జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణపెద్దపల్లి జిల్లా

Godavarikhani : అక్రమ కట్టడాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు..!

Godavarikhani : అక్రమ కట్టడాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు..!

గోదావరిఖని, మనసాక్షి:

నగర ప్రధాన చౌరస్తాలోని రామగుండం నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా 39 గుంటల స్థలంలో ఉన్న వివాదాస్పద భవనాలు గా పేర్కొంటూ మంగళవారం సాయంత్రం రామగుండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.

ఆపరేషన్ పోచమ్మ మైదాన్ లో భాగంగా గతంలోనే పలు దుకాణాలను నగరపాలక సంస్థ, సింగరేణి సంస్థ అధికారులు సమన్వయంతో కూల్చివేశారు. మిగతా భవనాలు కోర్టు పరిధిలో ఉండడంతో అక్కడితో ఆగిపోయారు.

మంగళవారం సాయంత్రం మళ్లీ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అన్ని భవనాలను కూల్చివేత చర్యలు చేపట్టారు. దుకాణాలలో ఉన్న వ్యాపారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు భారీగా మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

దుకాణాలలో ఉన్న సామాగ్రిని సంబంధిత వ్యాపారులు బయటకు తీసుకు వెళుతుండగానే మరోవైపు జెసిబి లతో భవనాలను కూల్చి వేశారు. సుమారు 20 కి పైచిలుకు భవనాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. ఈ కూల్చివేతలు బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది.

MOST READ : 

  1. Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!

  2. Justice Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎవరో తెలుసా..!

  3. District collector : నానో యూరియా తో అధిక దిగుబడి.. రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  4. Shankarpalli : శంకర్‌పల్లి పట్టణానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

మరిన్ని వార్తలు