Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Shankarpalli : శంకర్‌పల్లి పట్టణానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

Shankarpalli : శంకర్‌పల్లి పట్టణానికి పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

శంకర్‌పల్లి, మన సాక్షి :

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. పట్టణ పురాతన చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు చిన్న శంకర్‌పల్లి కాలనీలో పురాతన మహిమగల శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ శంకర దాసమయ్య అనే భక్తుడు ఆలయంలో పూజలు చేస్తూతపస్సు చేసేవాడు. మహిమ గల స్వామిగా పేరొందడంతో ఆయనను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు వచ్చేవారు.

కాలక్రమంలో దేవాలయం శంకరుడి ఆలయంగా పేరొందింది. జనం రాకపోకలు కొనసాగించడంతో సమీపంలో ఓ పల్లె ఏర్పడింది. శంకర దాసమయ్య పేరుతో అది శంకర్‌పల్లిగా మారింది. అనంతరం దాని సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పడడంతో గ్రామం విస్తరించింది. రైలు సదుపాయం ఉండడంతో వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారితో శంకర్‌పల్లి పట్టణంగా విస్తరించింది.

దేవాలయం ముందు అఖండ జ్యోతి వెలుగుతూ ఉండేదని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ వెలిగే అఖండ దీపం గోల్కొండ కోటపైకి కనిపించేదని చెబుతారు. చిన్న శంకర్‌పల్లి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. స్వామి లింగ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తాడు. అమ్మవారు పార్వతి దేవిగా, గణపతి, నందిలను దర్శనం చేసుకోవచ్చు.

ఆలయ ప్రాంగణంలో పురాతన నాగదేవతలు రాతిపై చెక్కబడి ఉన్నాయి. త్రిదళం, ఏకబిల్వం చెట్లు కొన్ని సంవత్సరాల కిందటివి ఆలయ ఆవరణలో ఉన్నాయి. పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేస్తారు. ఆలయంలో ప్రతి సోమవారం, పౌర్ణమి పర్వ దినాలలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు. భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. శంకర్‌పల్లి పట్టణ కేంద్రం నుండి ఆలయానికి ఆటోల ద్వారా చేరుకోవచ్చు. రైల్వే స్టేషన్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.

MOST READ : 

  1. TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

  2. Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!

  3. Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!

  4. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. వారు తక్షణమే స్పందించాలి..!

  5. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు