తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్, ఇటుకల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్, ఇటుకల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పగిడి మారి శివారులో గల డంపింగ్ యార్డును మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాయంక్ మిత్తల్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ లో కొనసాగుతున్న తడి చెత్త, పొడి చెత్త నిర్వహణను పర్యవేక్షించారు.

నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల నుంచి రోజుకు ఎంత చెత్త సేకరణ జరుగుతుందని? ఎన్ని ట్రాక్టర్లు? ఎన్ని ఆటో లు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ సునీతను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రోజుకు 18 మెట్రిక్ టన్నుల చెత్తను 4 ట్రాక్టర్లు, 10 ఆటోల ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించడం జరుగుతుందని కమిషనర్ సునీత కలెక్టర్ కు తెలిపారు.

డంపింగ్ యార్డ్ లో ఇతర వ్యర్ధాల నిర్వహణ ఎలా సాగుతోందని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో సేకరించిన చెత్తా చెదారాన్ని యార్డులో వేరు చేస్తున్న తీరును కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆయిల్ ను తయారీని, ఇటుకల తయారీని కూడా పరిశీలించారు. ఇటుకలు, అయిల్ ను ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

డంపింగ్ యార్డ్ లో చెత్త నిర్వహణ కోసం స్టాటొస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనే సంస్థ కు నెలకు రూ.4 లక్షలు చెలిస్తున్నట్లు కమిషనర్ సునీత కలెక్టర్ కు వివరించారు. చివరగా కలెక్టర్ మానవ వ్యర్థాల నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. డంపింగ్ యార్డ్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె అనసూయ, ఇంజినీర్ మహేష్, హెల్త్ అసిస్టెంట్ లు శ్రీనివాస్ జి, చెన్నకేశవులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Runamafi : రైతుల ఖాతాలలోకి డబ్బులు.. రెండు విడతలుగా రు.12,224 కోట్ల రుణమాఫీ, జిల్లాల వారీగా వివరాలు..!

Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు