Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!

జగిత్యాల, (మన సాక్షి)

ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 43 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓలు మధు సుధన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, డిఆర్డీఓ రఘు వరన్, డిపిఓ మధన్ మోహన్,  వివిధ జిల్లా అధికారులు, తహసీల్దర్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Khammam : గిరిజన పాఠశాలలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!

  4. Gold Price : బంగారం ధర మళ్లీ 15,300 పెరిగిందా.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు