District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల,కళాశాల వరుసతిగృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెన్షన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో వంటలు చేసిన విషయం తెలియడంతో వెంటనే కలెక్టర్ నారాయణఖేడ్ ఆర్డిఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు.
ఆర్డీవో గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడి విద్యార్థులు వంట చేసిన విషయం వాస్తవమేనని కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో ఆర్డీవో నివేదిక ఆధారంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి. మహేష్, మ్యాథ్స్ ఉపాధ్యాయులు కె.శివకుమార్ లను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కు గురైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
■ MOST READ NEWS :
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం..!
-
Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!
-
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
Miryalaguda : మిర్యాలగూడలో నకిలీ సర్టిఫికెట్ల దందా.. గద్వాలలో వెలుగులోకి..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!









