TOP STORIESBreaking Newsఉద్యోగంఖమ్మం జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!

District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!

ఖమ్మం, మన సాక్షి:

ఖమ్మం త్రీటౌన్ జహీర్ పురా కూడలిలో వికలాంగురాలు డంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలో పర్యటిస్తుండగా పల్లీ బండి వికలాంగురాలు కమలమ్మ వద్ద  కారు ఆగింది. ఎవరో తెలియని కమలమ్మ పల్లీలు కావాలా సార్ అని కలెక్టర్ ను అడగ్గా… నవ్వి ఊరుకున్నారు.

వికలాంగ మహిళ కమలమ్మ కుటుంబ పరిస్థితిని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఇక మిగిలింది.. ఒక్కరే సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. కలెక్టర్ స్పందించి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.

అనంతరం కలెక్టర్ కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసి కమలమ్మకు రుణం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో స్థానిక బ్యాంకు ఆధ్వర్యంలో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీఓ రోజా వ్యాపార రుణం చెక్కు రూ. గురువారం కేవలం ఐదు రోజుల్లో 1 లక్ష. త్వరలో కమలతో కూరగాయల వ్యాపారం చేసేందుకు చర్యలు చేపట్టారు.

MOST READ : 

మరిన్ని వార్తలు