Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!

Hyderabad : బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. ఒక్కొక్కరి నుంచి మూడు లక్షలు వసూలు..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఐటి కంపెనీ నిండా ముంచి బోర్డు తిప్పేసింది. ఎన్ ఎస్ ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో ఉద్యోగులను ఘరానా మోసం చేసింది. శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగం కల్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేసింది. సుమారు 400 మంది విద్యార్థులను చేర్చుకొని ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. కాగా ఆ కంపెనీ అధినేత స్వామి నాయుడు డబ్బులు వసూలు చేసి ఐడి కంపెనీని మూసేసినట్లు తెలుస్తుంది.
హైదరాబాదులోని ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమయ్యాయి నిరుద్యోగుల ఆశలను, లక్ష్యాలను ఆసరాగా చేసుకుని ఐటి కంపెనీలు బురిడీ కొట్టిస్తున్నాయి. గల్లీకో కంపెనీ వెలసి శిక్షణ పేరుతో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నాయి. ఐటి జాబ్ కోసం గంపెడాశలతో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ చేరుతున్న యువత ఇలాంటి నకిలీ కంపెనీల బుట్టలో పడుతున్నారు.
సాఫ్ట్వేర్ కంపెనీలు అపార్ట్మెంట్లలో కార్యకలాపాలు చేస్తూ 90% ఫేక్ కంపెనీలో నడుపుతున్నారు. శిక్షణ ఇస్తామని, ఉద్యోగం కల్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నారు. ముందుగా ఉద్యోగులే తమ కంపెనీ వదిలి పోయేలా ప్రయత్నం చేస్తుంటారు. ఆ తర్వాత కంపెనీ బోర్డు తిప్పేస్తున్నారు. ఇలాంటిదే మాదాపూర్ లో చోటుచేసుకుంది.
MOST READ :









