Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Theft : కాటమయ్య గుడిలో బంగారం, వెండి ఆభరణాలు దోపిడి..!

Theft : కాటమయ్య గుడిలో బంగారం, వెండి ఆభరణాలు దోపిడి..!

చింతపల్లి, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల పరిధిలోని అన్న బోయినపల్లి గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి కాటమయ్య గుడిలో గుర్తుతెలియ వ్యక్తులు దోపిడికి పాల్పడి సుమారు మూడు లక్షల వరకు నగదు,, బంగారం, వెండి ఆభరణాలు దోచుకొని వెళ్లిన సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామ ప్రజలు, పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం దాతల సహకారంతో గత రెండు సంవత్సరాల క్రితం గ్రామ సమీపంలో కాటమయ్య గుడిని నెలకొల్పేందుకు సుమారు మూడు లక్షల వరకు గ్రామ ప్రజలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు.

అందులో భాగంగా ప్రతి సంవత్సరం కాటమయ్యకు బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం గ్రామ ప్రజలు గుడిలో పూజలు చేసేందుకు అక్కడికి వెళ్లారు.గుడి తలుపులు తెరిచి చూడగా, ముందుగా దర్శనం ఇచ్చే ఉండి పగలగొట్టి కింద పడి ఉండడంతో పాటు గర్భగుడిలో ఉన్న అమ్మవారి మెడలోని వెండి, బంగారం, ఆభరణాలు, కనిపించకపోవడంతో. గ్రామ ప్రజలు ఒకసారి గా అవాక్కయ్యారు.

సంఘటన విషయాన్ని గమనించిన భక్తులు వెంటనే మాడుగుల మండల పోలీసులకు సమాచారం అందించారు. గ్రామ ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు మాడుగుల మండలం పోలీస్ లు సంఘటన స్థలానికి విచ్చేసి సమాచారాన్ని సేకరించారు. గ్రామ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

  2. Miryalaguda : అర్ధరాత్రి నడిరోడ్డుపై యువకుల హల్ చల్.. ( వైరల్ వీడియో)

  3. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  5. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు