Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో చేయి విడిచి కారెక్కిన నేతలు..!

Miryalaguda : మిర్యాలగూడలో చేయి విడిచి కారెక్కిన నేతలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ పార్టీ పిరాయింపులు కొనసాగుతున్నాయి. మాడ్గులపల్లి మండలంలోని పాములపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ సర్పంచ్ యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎం ఎల్ ఏ నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీ ఆర్ ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా బీ ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక మిర్యాలగూడ టౌన్ రెడ్డికాలనీ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో..

ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బారాస బలపరచిన అభ్యర్ధి చింతకాయల సైదులు గెలుపుకై 100 మంది కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఈ రోజు పార్టిలో రావటం నిజంగా శుభపరిణామం,

10 ఏళ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీ ఆర్ అధ్వర్యంలో గ్రామాలు సంపూర్ణ అభివృద్ది సాధించాయని అన్నారు. అదే విధముగా కే సీ ఆర్ హయాంలో ప్రభుత్వ ఫలాలు అందిపుచ్చుకున్న వారే బారాస బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధిని గెలిపిస్తారని చెప్పారు.

కార్యక్రమములో మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, మాజీ పీ ఎ సీ ఎస్ చైర్మన్ జేరిపోతుల రాములు గౌడ్, మాజీ సర్పంచ్ లు యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, జానయ్య, బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి చింతకాయల సైదులు, వేముల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

  2. TG News : రైతులందరికీ భూదార్ కార్డులు.. పంపిణీ ఎప్పుడంటే..!

  3. PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. వారికి ఒకేసారి రూ.4వేలు ఖాతాలలో జమ..!

  4. TG News : టీచర్లకు బిగ్ షాక్.. అలా చేస్తే ఉద్యోగం ఊస్ట్..!

మరిన్ని వార్తలు