Miryalaguda : కల్యాణ తలంబ్రాలాపై ‘ ఓం నమో నరసింహాయ నమః ‘ నామం లిఖితం..!
Miryalaguda : కల్యాణ తలంబ్రాలాపై ‘ ఓం నమో నరసింహాయ నమః ‘ నామం లిఖితం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ లో పంచ నరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధి పుణ్యక్షేత్రము సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రo. 30, 116 బియ్యపు గింజలపై మిర్యాలగూడ పట్టణం కు చెందిన సూక్ష్మ చేతి రాత కళాకారిణి గుంటూరు గేయవర్షిణి ‘ ఓం నమో నరసింహాయ నమః ‘ అని పదమూడు అక్షరాల నరసింహ స్వామి మంత్రాన్నీ ప్రతీ బియ్యపు గింజపై లిఖిన్చింది.
ఈ నెల 11వ తారీకున స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం కు సమర్పించుటకు గాను 77 రోజులు పాటూ దీక్ష తీసుకుంది. మిర్యాలగూడ పట్టణం కు చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి గుంటూరు శ్రీనివాసు శ్రీలక్ష్మి ల దంపతుల కుమార్తె గేయవర్షిణి స్థానికంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఉపవాసం వుంటూ మౌనం పాటిస్తూ ప్రతీ బియ్యపు గింజపై పదమూడు అక్షరాల నరసింహ స్వామి సాధారణ జెల్ పెన్ను తో నామన్ని లిఖిన్చింది.
రోజులో ఆమె ఏడు నుండి ఎనిమిది గంటలు బియ్యపు గింజలపై నామన్ని లిఖించడానికి కేటాయిస్తుంది. ఆమె రాస్తున్నంతసేపు ఉపవాసం మరియు మౌనం వ్రతం పాటించడం ఆమె ప్రత్యేకత.
తండ్రి 2005వ సంవత్సరం లో బియ్యపు గింజలపై నామన్ని లిఖించాలని ప్రయత్నించారు. కానీ వారు లిఖించలేకపోయారు. తన తండ్రి కోరికను నెరవెర్చాలని గత సంవత్సరం నుండి బియ్యపు గింజలపై నామన్ని లిఖించడం ప్రారంభించింధి. మట్టపల్లి దేవాలయం లో సమర్పించుట ఇది రెండో సంవత్సరం.
గత సంవత్సరంలో మట్టపల్లి లో 31,116 బియ్యపు గింజలపై ఐదు అక్షరాలు ‘నరసింహా ‘ నామం లిఖించిన అక్షర తలంబ్రాలను కళ్యాణం లో సమర్పించారు. అందుకుగాను గేయవర్షిణి కి బహుజన సాహిత్య అకాడమీ వారు కళారత్న జాతీయ అవార్డు చే పురస్కారించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయం లో ఆరు అక్షరాల ‘ శ్రీ నరసింహ ‘ నామాన్ని లిఖిన్చిన 12,116 అక్షర తలంబ్రాలను సమర్పించారు. బహుజన సాహిత్య అకాడమీ వారు అంతర్జాతీయ మైక్రో హ్యాండ్ రైటింగ్ అవార్డు చే ఢిల్లీ లో తెలుగు అసోసియేషన్ ఆడిటోరియం లో 15 డిసెంబర్, 2024 తారీఖున సన్మానించారు. డిసెంబర్ 16న ఢిల్లీ లో శాస్త్రి భవన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గేయవర్షిణి ని అభినందిచినారు.
వాడపల్లి ఆలయం లో ఏడు అక్షరాల ‘ ఓం నరసింహ ‘ నామన్ని లిఖించి 12,116 అక్షర తలంబ్రాలను సమర్పించారు. సాధారణ జెల్ పెన్ను తో పదమూడు అక్షరాల నరసింహ నామన్ని ప్రతీ బియ్యపు గింజపై నామన్ని లిఖించింధి. ఇప్పటివరకు 30,116 బియ్యపు గింజలపై 3,91,508 అక్షరాలను లిఖించింది అదికూడ 75 రోజుల్లో. కళ్యాణం వరకు 77 రోజుల పాటూ దీక్ష తీసుకోని 32,116 బియ్యపు గింజలపై నరసింహ స్వామి నామన్ని లిఖించాలి అని అనుకుంటుంది.
ఇవి కూడా చదవండి :
-
AI : అదుగో అదుగో.. ఏఐ చదువులమ్మ.. నీట్‌లో అదరగొట్టింది..!
-
Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
-
Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!










