తెలంగాణBreaking Newsవైద్యంహైదరాబాద్

Gold Price : దడ పుట్టిస్తున్న పసిడి ధర.. హ్యాట్రిక్, ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : దడ పుట్టిస్తున్న పసిడి ధర.. హ్యాట్రిక్, ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర గుండెల్లో దడ పుట్టిస్తుంది. రోజురోజుకు పసిడి ధర పెరిగి ఆకాశాన్నంటుతుంది. వరుసగా మూడో రోజు బంగారం ధర భారీగా పెరిగి హ్యాట్రిక్ కొట్టింది. బుధవారం (డిసెంబర్ 11) ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 8700 పెరిగింది. మహిళల కు నిరాశ కలిగింది.

బంగారం తగ్గుముఖం పడుతుందని భావించిన మహిళలకు నిరాశ కలిగింది. 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు మంగళవారం 7,86,600 రూపాయలు ఉండగా 8700 పెరిగి బుధవారం 7,94,700 రూపాయలకు చేరింది. 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర మంగళవారం 7,20,500 ఉండగా 8000 రూపాయల పెరిగి 7, 28, 500 రూపాయలకు పెరిగింది.

తులం బంగారం హైదరాబాదులో (10 గ్రాములకు) 22 క్యారెట్స్ 72,850 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ తులం (10 గ్రాములకు) 79,470 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా బంగారం ధరలు ఆకాశన్నంటడంతో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మహిళలు వలన వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు