Breaking NewsTOP STORIESహైదరాబాద్

Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

Gold Price : ఒక్కరోజే రూ.6600 తగ్గిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు శుభవార్త అందింది. బంగారం ధర రోజురోజుకు తగ్గుతుంది. దాంతో మహిళలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో తులం బంగారం లక్ష రూపాయలకు పైగా పెరిగిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ తగ్గుతూ వస్తుంది. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 6600 రూపాయలు తగ్గింది.

హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 6600 తగ్గగా 9,81,800 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 6000 రూపాయలు తగ్గడంతో 9,00,000 రూపాయలుగా ధర ఉంది.

తులం ఎంతంటే..

తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) బంగారం బుధవారం ధర 24 క్యారెట్ కు 98,180 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ కు 10 గ్రాముల (తులం) బంగారం కు 90 వేల రూపాయలు ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి : 

  1. ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. లంచం తీసుకుంటూ దొరికిన టాక్స్ అధికారిని..!

  2. MLA : మాస్టర్ ప్లాన్ పై ఎమ్మెల్యే సంజయ్ కీలక ప్రకటన.. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు..!

  3. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  4. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు