Breaking Newsతెలంగాణరాజకీయం

TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

TG News : తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ నిజమేనా.. సీఎంకు ఆ ఎమ్మెల్యే లేఖ..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయినట్లుగా సోషల్ మీడియాలో భారీ ప్రచారం సాగుతోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలి పై ఆ ఎమ్మెల్యేలు భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ ఎమ్మెల్యేల భేటీకి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారథ్యం వహించారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతుంది.

కానీ హనుమకొండ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. లేఖలోని సారాంశం ఏంటంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా దుష్ప్రచారం అని పేర్కొన్నారు. ఆయన ఏ మీటింగ్ కు వెళ్లలేదని చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం జరుగుతుందో..? అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తా అని పేర్కొన్నారు.

కుట్రలో వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని రాజేందర్రెడ్డి తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి దోషులపై కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కి కూడా లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. ఒకవేళ నలుగురు ఎమ్మెల్యేలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నా అభివృద్ధి గురించి చర్చించుకునే అవకాశం ఉంది. వేరే పార్టీ వాళ్ళతో సమావేశం కాలేదు కదా అంటూ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన ఉండగా ఆ పర్యటనను రద్దు చేసుకొని సీఎంతో భేటీకానున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిస్థితులపై వారు సమీక్షించే అవకాశం ఉంది.

MOST READ : 

మరిన్ని వార్తలు