పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్..!
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్..!
కంగ్టి, మన సాక్షి :-
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగూర్ కే గ్రామాన్ని ఎంపీడీఓ సత్తయ్య, స్పెషల్ ఆఫీసర్ ఏడిఏ నూతన్ కుమార్ తో కలిసి సందర్శించి స్థానిక పాఠశాలలను గురువారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో మెనూ ప్రకారం వండిన మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును రికార్డులు పరిశీలించారు.
విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం పిల్లలకు ఉదయం టిఫిన్ రాగి జావా అందజేశారు. మొత్తం 230 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు.
అలాగే గ్రామంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ సుభాష్ ,స్థానిక టీచర్లు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు విద్యార్థులు ఉన్నారు.
ALSO READ :
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









