Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!
Rythu : వరి కోయలకు నిప్పు రైతులకు ముప్పు.. ఎందుకో ప్రతి రైతు తెలుసుకోవాల్సిందే..!
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
వరికోయలకు నిప్పు పెట్టడం భూసారానికి ముప్పు అని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట మండల పరిధిలోని కుసుమవారిగూడెంలో వరి కొయ్యలు కాల్చడం వలన జరిగే అనర్ధాలు రైతులకు వివరించారు.
వరి కోయ్యలను తగలబెట్టడం ద్వారా అనేక అనర్ధాలు జరుగుతున్నాయి నేలకు మేలు చేసే క్రిమి కీటకాలు నశించడమే కాదు, భూమిలో సారం తగ్గిపోయి వాయి కాలుష్యం పెరగడం లాంటి నష్టాలు కలుగుతాయి.
ముఖ్యంగా ఎండాకాలంలో కాల్చివేయడంతో భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు విలువైన ఆస్తులు మూగజీవాలు అగ్నికి బలవుతున్నాయి. కాబట్టి కొయ్యకాలను కాల్చకుండా మల్చర్ పద్ధతిలో అయిన లేదా గడ్డిని కలియదున్నినా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.
భూసారంతో పాటు దిగబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ సందీప్ ఏఈఓ ముత్తయ్య ఆదర్శ రైతు గోగుల ముత్తయ్య, వెంకట్ రెడ్డి నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Health : ఆరోగ్యంగా ఉన్న వారిలో సగం మందికి గుండెపోటు ముప్పు.. నివారించుకోవచ్చా తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Hair Fall : పురుషులకే బట్టతల ఎందుకు.. నివారణకు సూచనలు..!









