ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!
ఆ గ్రామంలో సంపూర్ణ మధ్య నిషేధం.. అమ్మితే రూ. 50 వేలు జరిమానా.. ఏకగ్రీవ నిర్ణయం..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్… మండల పరిధిలోని ఏను బాములగ్రామంలో సంపూర్ణ మద్య పాన నిషేధం అమలు చేనుండడంతో ఆ గ్రామం చరిత్ర లో నిలిసి పోనుంది. ఫిబ్రవరి 1 శనివారం నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కు గ్రామం మొత్తం ముక్కుమ్మదిగా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. మహిళా సంఘాలు, యువజన సంఘాలు అఖిల పక్షాల ఆద్వర్యం లో గ్రామం లో ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు.
బెల్ట్ షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఒకవేళ ఎవరైనా మద్యం విక్రయిస్తే 50 వేల రూపాయలు జరిమానా విధించి ఆ సొమ్మును గ్రామ పంచయతీ కి అప్పగించి గ్రామ అభివృద్ది పనుల కు ఖర్చు చేయాలని తీర్మానం చేశారు.
జనవరి 9న గ్రామంలో అఖిల పక్షాల ఆద్వర్యం లో సమావేశం ఏర్పాటు చేసి మద్య నిషేధం అమలు పై తీర్మాణించినట్లు ఉద్యమ నాయకుడు తగుళ్ళ జనార్దన్ తెలిపారు. బెల్ట్ షాపుల వారి కోరిక మేరకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు.
ఫిబ్రవరి 1నుండి గ్రామం లో బెల్ట్ షాపులు బంద్ చేయడమే కాక గ్రామం లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మద్య నిషేధం కు మండల జేఏసీ సంఘీభావం ఇవ్వడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లోఈ కార్యక్రమంలో తగుళ్ళ జనార్ధన్ యాదవ్, కలకోట్ల సీతారాములు ,పసునూరి అంజి, కోడిమల నాగరాజు, సైదులు, పారేల్లి నవీన్, నరేష్, రాజు, కృష్ణ గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
- District collector : కలెక్టరేట్ లో ప్రజావాణి రద్దు.. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!
- Suryapet హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ గా పదోన్నతి..!
- TG News : మాదకద్రవ్యాల నియంత్రణ పై ప్రత్యేక నిఘా.. ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీ..!
- Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?









