District collector : మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కాదు.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
District collector : మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కాదు.. జిల్లా కలెక్టర్ స్పష్టం..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా, పీఏ పల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులు ఎలాంటి ఫుడ్ పాయిజనింగ్ కు గురికాలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. విద్యార్థినిలు కడుపునొప్పి కారణంగా అస్వస్థతకు గురికావాడం జరిగింది అన్నారు.
మంగళవారం ఫుడ్ పాయిజన్ వల్ల నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని హుటాహుటిన ఆమే నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు.
అస్వస్థతకు గల కారణాలను ఆమె విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఏ పల్లి మోడల్ స్కూల్ కు చెందిన నలుగురు విద్యార్థినిలు కడుపునొప్పి కారణంగా అస్వస్థతకు గురికాగా, తక్షణమే వారిని దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, అక్కడ డాక్టర్లు విద్యార్థినిలకు అన్ని పరీక్షలు నిర్వహించి వారికి చికిత్స అందించడం జరుగుతున్నదని అన్నారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. వారి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, ముఖ్యంగా విద్యార్థినిలు ఎలాంటి ఫుడ్ పాయిజన్ కు గురి కాలేదని స్పష్టం చేశారు. గడచిన 3 రోజుల నుండి సదరు విద్యార్థులు సరైన ఆహారం తీసుకొక పోవడంవల్ల నిరసించిపోయి డిహైడ్రేషన్ కు గురయ్యారని తెలిపారు.
తనతో పాటు, ఆర్డిఓ ,డి ఎస్ పి ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించడం జరిగిందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికై అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని, 24 గంటలు వారిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో పరిశీలనలో ఉంచడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతానికి నలుగురు విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ,ఏలాంటి ఇబ్బంది లేదని, ప్రత్యేకించి దేవరకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్ విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, డిఎస్పి, ఏరియా ఆసుపత్రి సూపరింటీండెంట్, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Nalgonda : 7న నల్గొండలో బహిరంగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో మోడల్ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినిలకు అస్వస్థత..!
-
District collector : జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సరెండర్..!
-
Devarakonda : గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రాణాపాయ స్థితిలో వృద్ధురాలు..!









