Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవైద్యం

Devarakonda : ఇలా వచ్చారు.. అలా వెళ్లారు..!

Devarakonda : ఇలా వచ్చారు.. అలా వెళ్లారు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు వైద్యులు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. దూరప్రాంతాల నుంచి ఆసుపత్రికి రావడానికి రోగులకు మధ్యాహ్నం అవుతుంది. కానీ వైద్యులు మాత్రం 12 గంటల లోపే వెళ్ళిపోతున్నారు.

రోగులకు వైద్యులు అందుబాటులో ఉండాల్సింది పోయి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దాంతో రోగులు ఏం చేయాలో పాలు పోని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యుల కోసం వచ్చిన రోగులు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది.

ప్రస్తుత వైరల్ ఫీవర్ సీజన్లో ఆసుపత్రికి ప్రతిరోజు మారుమూల గ్రామాల నుంచి రోగులు వస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ 12.30 గంటలకు కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

ఆసుపత్రికి వచ్చిన రోగులు ఒంటిగంట వరకు వేచి చూసి వెళ్ళిపోయారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి వైద్యులపై చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు