మిర్యాలగూడ : బైక్ లో రైతు సొమ్ము దొంగిలించిన వ్యక్తి .. ఫోటో విడుదల చేసిన పోలీసులు.. !

మిర్యాలగూడ : బైక్ లో రైతు సొమ్ము దొంగిలించిన వ్యక్తి .. ఫోటో విడుదల చేసిన పోలీసులు.. !

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల రైతు బైక్ లో నుంచి డబ్బులు దొంగిలించిన అనుమానాస్పద వ్యక్తి ఫోటోను శుక్రవారం పోలీసులు విడుదల చేశారు ఆ వ్యక్తి ఆచూకీ తెలియజేస్తే తగిన పారిశోధికం పారితోషికం ఇవ్వనున్నట్లు మిర్యాలగూడ పట్టణ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా దొంగతనం కేసును చేదించేందుకు పోలీసులు సరికొత్తగా వ్యవహరించి దొంగ ఫోటోలు విడుదల చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఈనెల మూడవ తేదీన నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని పోస్ట్ ఆఫీసు వద్ద హట్యాతండా కు చెందిన లావుడ్యా శంకర్ అనే రైతు రూ. 1,50,000/- వడ్ల బిల్లు డబ్బులు, తన బైక్ టాంక్ కవర్ లో పెట్టుకుని టైరు పంచరు చేయిస్తుండగా దొంగతనం చేసినాడు.

కావున ఇట్టి దొంగ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పై వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి పోలీసు వారు తగు పారితోషికం ఇవ్వ నిర్ణయించినారు. కావున ఎవరైనా ఇట్టి వ్యక్తిని గురించి వివరాలు తెలిసిన యడలా Ph: 99663 07361, 87126 70149 & 97054 25005 లను సంప్రదించాలని తెలిపారు.

 

ఇతడు మిర్యాలగూడ లోనే కాకుండా ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడుతుంటాడని ఇతనితో పటు ముఠా ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.