క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!

Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురుతో కూడిన ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చండూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర జల రమేష్ బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్, ( ఇతను పరారీలో ఉన్నాడు) చండూర్ మండలానికి చెందిన మహమ్మద్ జానీ పాషా, చండూర్ కు చెందిన దోమలపల్లి యాదగిరి( ఇతను పరారీలో ఉన్నాడు)

కనగల్ మండలం ఎడవల్లి చెందిన బొమ్మరబోయిన భార్గవ్, చండూరుకు చెందిన సాయి ఉపేంద్ర , చండూరు మండలం కస్థాలకు చెందిన జాల వెంకటేష్ .అనే నేరస్తులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు . నేరం చేసిన విధానం ఎస్పీ తెలియజేస్తూ కర్ణాటక బెంగళూరుకు చెందిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చండూరుకు చెందిన జానీ పాషాక్ ఫోన్ చేసి రానున్న ఎలక్షన్లలో మద్యం ఎక్కువ సేల్ అవుతుంది.

కావున స్థానికంగా ఏదైనా అనువైన ప్రదేశం చూపిస్తే తాను వచ్చి నకిలీ మద్యం తయారు చేసి ఇస్తానని నేరెస్టులుముందస్తుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తే పది లక్షల రూపాయల మద్యం తయారు చేసి ఇస్తానని చెప్పాడు.

దీంతో జానీ తనకు పరిచయమున్న చండూరు చెందిన ఎర్రజల్ల రమేష్ దోమలపల్లి యాదగిరి ఆలియాస్ మంగళగిరి లు కలిసి నకిలీ మద్యం తయారు చేయించాలని నిర్ణయించుకొని ఎర్రజెల్ల రమేష్ నాంపల్లి మండలం గానుగు పల్లి కోళ్ల ఫారం దగ్గర ఉన్న తన సొంత తోటలో మద్యం తయారు చేయించాలని నిర్ణయించుకున్నారు.

జానీ పాషా రమేష్ యాదగిరిలు కలిసి శ్రీనివాస్ గౌడ్ తో తాము నకిలీ మద్యం తయారు చేయడానికి నిర్ణయించుకున్నామని బెంగళూరు నుండి అవసరం ఉన్న ముడి సరుకులు పంపాలని తెలిపారు. వెంటనే శ్రీనివాస్ గౌడ్ఈ సంవత్సరం ఫిబ్రవరి మొదటి వారంలో ఐదు డ్రమ్ముల స్పిరిట్ పంపగా రమేష్ తోటలో పెట్టినారు. ముగ్గురు కలిసి ఎర్రజల్ల రమేష్ మంగలి యాదగిరి తలా రెండు లక్షలు వేసుకొని మొత్తం ఆరు లక్షల రూపాయలు శ్రీనివాస్ గౌడ్ ఇచ్చినారు.

కల్తీ మద్యం పరిశీలిస్తున్న నల్గొండ జిల్లా ఎస్పీ

 

దీంతో కర్ణాటక చెందిన శ్రీనివాస్ వచ్చి రాగానే నేరస్తులను వెంటనే ఒక పది లీటర్ల క్వాంటిటీ కలిగిన 40 బిస్లరీ వాటర్ బాటిల్ తీసుకురామని చెప్పగా నెల రోజుల క్రితం వారు 40బిస్ లారిబాటిల్స్ తీసుకోచ్చి రెండు ద్రమ్ముల స్పిరి ట్ డ్రమ్ములలో నింపి సదరు శ్రీనివాస్ గౌడ్ తెచ్చిన మూడు రకాల ఫ్లేవర్స్ దాదాపు ఒకటి మూడు లీటర్లు ఉన్నవి తీసుకొచ్చి అందులో కలిపి దాదాపు రెండు డ్రముల స్పిరిట్ ను కల్తీ మద్యంగా తయారు చేసి సుమారు 20 లీటర్ల పరిమాణంగాల 40 బబుల్స్ నింపి రెండు మూడు రోజులు అట్లా పులియబెట్టి తర్వాత ఒక్కొక్క బబ్బుల్ని 10,000 రూపాయలకు అమ్మాలని చెప్పినాడు.

అలా మీరు ముగ్గురు కలిసి మునుగోడు లో గల వైన్ షాపులో పార్ట్నర్ అయిన జాల వెంకటేశుని కలిసి మద్యం సరఫరా చేస్తామంటే అతను ప్యాకింగ్ సరిగా లేదు ప్యాకింగ్ సరిగ్గా ఉంటే తీసుకుంటానని చెప్పినాడు తర్వాత రమేష్ వాళ్ళ అత్తగారి ఊరైన జి యడవల్లి గ్రామంలో ఆయన పరిచయం ఉన్న బొమ్మరబోయిన భార్గవ్ను సంప్రదించగా అతడు పదివేల రూపాయలు ఇచ్చి 20 లీటర్ల బబుల్స్ నాలుగు తీసుకొని అతనికి తెలిసిన బెల్ట్ షాప్ నిర్వాహకులను మద్యం సరఫరా చేస్తా అని అడిగితే వారు కూడా నిరాకరించారు.

ఉపేంద్రకు కూడా డబ్బులు ఇస్తామని మద్యం నీ ఆటోలో చెప్పిన ప్లేస్ కి చేరవేయాలని చెప్పినారు ఈ విధంగా కల్తీ మద్యం తయారు చేసి ప్రజలకు సరఫరా చేసే క్రమంలో వీరిని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇట్టి కల్తీ మద్యం ప్రజలు తాగినట్లయితే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లె అవకాశం ఉన్నందున వీరిపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడమైనది అని తెలిపారు.

అదేవిధంగా చండూరు మండలం దుబ్బగూడం గ్రామంలో ఒక గుడిసెలో నేరస్థులకు సంబంధించిన 20 బబుల్స్ 400 లీటర్లస్పిరిట్ స్వాధనం పరుచుకొని ఎక్సైజ్ చండూర్ పోలీస్ వారు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నేరస్తులను పట్టుకోవడంలో దేవరకొండ ఎస్పి మౌనిక. టాస్క్ఫోర్స్ సిఐ రమేష్ బాబు, ఎస్సైలు మహేందర్, వప్రసాద్, సిఐ రాజు. నాంపల్లి ఎస్సై శోభన్ బాబు , నాంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎక్సైజ్ పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు.

MOST READ : 

  1. Thummala : రైతులకు మంత్రి తుమ్మల శుభవార్త..!

  2. Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!

  3. Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!

  4. Miryalaguda : బలంపియాడ్ పరీక్షలో సెయింట్ జాన్స్ విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు.!

  5. TG News : పండుగ వేళ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు