క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలుగా వ్యవహరిస్తున్నారు. 14 సంవత్సరాలుగా చోరీలకు పాల్పడుతుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చినా కూడా వారి దొంగబుద్ధి మానలేదు.

వారిని సోమవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణం సుందర్ నగర్ కు చెందిన వేముల కోటేష్ అతని భార్య మాతంగి కృష్ణవేణి ఇద్దరు కూడా కూలీ పనులు చేసుకునేవారు.

కూలీకి వెళ్లగా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. 2010 వ సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. జైలుకు కూడా వెళ్లారు. అతని భార్య ఇంటి ముందు గమనిస్తూ ఉండగా అతడు మాత్రం ఇంట్లోకి వెళ్లి చోరీ పాల్పడేవాడు. ముఖ్యంగా తాళం వేసిన ఇల్లే వీరి టార్గెట్ గా ఉండేవి.

రెండు రాష్ట్రాలలో వేముల కోటేశ్ వివిధ పోలీస్ స్టేషన్లో 37 కేసులు, మాతంగి కృష్ణవేణి పై వివిధ పోలీస్ స్టేషన్లో పది కేసులు నమోదయ్యాయి. సోమవారం ప్రకాష్ నగర్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వాహనాన్ని చూసి వారు పరిగెడుతుండగా పట్టుకొని విచారించినట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి 97.9 గ్రాముల బంగారం, 50వేల రూపాయలు, ఐటెల్ స్మార్ట్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు చేదించిన టూ టౌన్ సీఐ నాగార్జున, మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, ఎస్ఐ రాంబాబు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ అక్బర్, రామకృష్ణను డి.ఎస్.పి రాజశేఖర్ రాజు అభినందించారు.

MOST READ : 

  1. Miryalaguda : కరాటే పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ..!

  2. Chicken Mela : ఫ్రీ చికెన్ మేళ.. ఎగబడ్డ మాంసం ప్రియులు..!

  3. Elections : మరో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..!

  4. Miryalaguda : ఈ భార్యాభర్తలు జగత్ కిలాడీలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు