TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇదే..?
TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇదే..?
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. 2024 ఫిబ్రవరి మాసంలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. వారి స్థానంలో ప్రత్యేక అధికారులు పాలన కొనసాగిస్తున్నారు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త బిల్లును కూడా తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
రిజర్వేషన్ల ఖరారు తో పాటు ఐదుగురు ఎంపీటీసీలు ఉంటే ఒక ఎంపీపీని ఏర్పాటు చేయాలనే నిబంధన కొత్తగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రాంతాల్లో ముగ్గురు ఎంపీటీసీలకే ఎంపీపీ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొని ఉన్నారు.
అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలని నిబంధనలు కూడా తొలగించనున్నారు. ఏది ఏమైనా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వేగవంతంగా కసరత్తు నిర్వహిస్తుంది.
కాగా 2025 జనవరి 14వ తేదీన గ్రామపంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మూడు దఫాలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. ఎన్నికలను పారదర్శకంగా కూడా నిర్వహించినట్లు పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు, గ్రామపంచాయతీల వారిగా ఓటర్ల జాబితాలను కూడా రూపొందించింది.
MOST READ :









