పెన్ పహాడ్ : మూడు పూరిండ్లు గడ్డివాము దగ్ధం

పెన్ పహాడ్ : మూడు పూరిండ్లు గడ్డివాము దగ్ధం
పెన్ పహాడ్ ప్రతినిధి, మన సాక్షి
మండల పరిధిలోని నాగులపాటి అన్నారంలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఎస్సీ కాలనీలో మూడు పూరి ఇల్లు గడ్డివాము దగ్ధమైనాయి.
నకరికంటి దేవయ్య, మీసాలపున్నయ్య, నకరికంటి చిన్న ఈదయ్య పూరి గుడిసెలు, గడ్డివాము పూర్తిగా దగ్ధమైనట్టు తాసిల్దార్ పామనగంటి శేషగిరిరావు తెలిపినారు.పూరి గుడిసెల గడ్డివాము విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉంటుందని ఆయన తెలిపినారు,
విద్యుత్ సర్క్యూట్ విషయం తెలుసుకున్న ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ అగ్నిమాపక కేంద్రం బృందంతో పూర్తిగా మంటలు అదుపు చేయించినారు. గ్రామ సర్పంచ్ ధనియాకుల కోటమ్మ సత్యనారాయణ , దొంగరి యుగేందర్, వై మురళి , మామిడి శోభన్ బాబు, నకిరే కంటి మైసయ్య, మీసాల జానయ్య , నకిరే కంటి సైదులు, నకిరేకంటి వెంకన్న కేకే మంటలు ఆర్పేందుకు సహాయం చేశారు