Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : సులువుగా డబ్బులు సంపాదించేందుకు.. కట్ చేస్తే పోలీసుల చెరలో ..!

Nalgonda : సులువుగా డబ్బులు సంపాదించేందుకు.. కట్ చేస్తే పోలీసుల చెరలో ..!

నల్లగొండ, మన సాక్షి:

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పోతమయ్య గడ్డకు చెందిన రిపేరింగ్ టెక్నీషియన్ సిరిగిరి సాయిబాబా సిరిసిల్ల జిల్లా బజార్ గ్రామానికి చెందిన సందడికారి సతీష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో వరుసగా తాళాలు వేసిన ఇండ్లలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ శరత్చంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పక్కా సమాచారంతో నార్కెట్పల్లి పోలీసులు నార్కట్పల్లిలోని నల్గొండ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా నల్గొండ నుండి చిట్యాలకి బజాజ్ ఆటోలో వెళ్తున్న వీరిని పట్టుకొని విచారించగా తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు.

వీరు గతంలో దొంగతనం కేసులో అరెస్టై ఈనెల 25న బెయిల్ పై విడుదలై ఎల్లారెడ్డిగూడెం మాధవ ఎడవల్లి లోని రెండు ఇండ్లలో మోత్కూర్ పిఎస్ పరిధిలో ఒక ఇంట్లో కల్వకుర్తి పీఎస్ పరిధిలో ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన తెలిపిన తెలిపారు నేరాలకు సంబంధించి నాలుగు కేసులలో 8:30 బంగారు ఆభరణాలు టీవీఎస్ విక్టర్ బజాజ్ ఆటో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

పైన పట్టుబడి సాయిబాబా పాత నేరస్థుడని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నల్గొండ యాదాద్రి భువనగిరి వరంగల్ జనగామ కరీంనగర్ సిరిసిల్ల సిద్దిపేట మహబూబ్నగర్ కర్నూలు జిల్లాలో దాదాపు 40 దొంగతనాల కేసులో నిందితునిగా ఉండి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చినాడని తెలిపారు.

అయినా అతనిలో ప్రవర్తనలో అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని ఆశతో తన అనుకున్న పథకం ప్రకారం సహాయంతో రాత్రి పగలు సమయంలో తాళం వేసి ఉన్న లక్ష్యంగా చేసుకొని తాళం పగలగొట్టి దొంగనాల పాపాలు పడుతున్నారు సిరిగిరి సాయిబాబా కి కరీంనగర్ జిల్లాలో పరిచయమైన సిరిసిల్ల జిల్లాకు చెందిన సుందరి సతీష్ సహకరించగా మీరు నిర్మాణం చేసినట్టు తెలిపారు.

నేరస్తులను పట్టుకోవడంలో నల్గొండ డిఎస్పి శివరామిరెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి ఇన్చార్జి వెంకటయ్య నార్కట్పల్లి ఎస్సై డీక్రాంత్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ రాము కానిస్టేబుల్ శివాశంకర్ గిరిబాబు తిరుమల సత్యనారాయణ అఖిల్ మహేష్ సాయికుమార్ ఇతర సిబ్బంది ని ఎస్పి అభినందించారు.

పట్టుబడిన నేరస్థడు అయిన సిరిగిరి సాయిబాబా సాయికుమార్ పాత నేరస్థుడు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో నల్గొండ, యదాద్రి భువనగిరి, వరంగల్, జనగాం, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్,కర్నూల్ జిల్లాలో దాదాపు 40 దొంగతనాల కేసులలో నిందితునిగా ఉండి అరెస్ట్ అయి జైలుకి వెళ్లి వచ్చినాడు.

అయిన తన ప్రవర్తనలో మార్పు రాక,చెడు వ్యసనాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో తాను అనుకున్న పథకం ప్రకారముగా ఒక ఇనుప రాడ్డు సహాయముతో రాత్రి, పగలు సమయంలో తాళం వేసి వున్న ఇండ్లను లక్షంగా చేసుకొని తాళం పగులగొట్టి దొంగతనాలకి పాల్పడుతున్నాడు.

ఇట్టి దొంగ సొత్తును అమ్ముటకు సిరిగిరి సాయిబాబా సాయికుమార్ కి కరీంనగర్ జిల్లా జైల్లో పరిచయం అయిన సిరిసిల్ల జిల్లాకి చెందిన సందరికారి సతీష్ సహకరించగా వీరిని అరెస్టు చేసి రిమాండు కు తరలించడం జరుగుతుంది.

ఇట్టి నేరస్తులను పట్టుకోవడములో నల్గొండ డి.ఎస్.పి. శ్రీ.కె.శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్ పల్లి ఇంచార్జీ సిఐ వెంకటయ్య ఆద్వర్యములో నార్కెట్ పల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ హెడ్ కానిస్టేబుల్ రాము, కానిస్టేబుల్ శివ శంకర్, గిరిబాబు, తిరుమల్, సత్యానారాయణ, అఖిల్, మహేశ్, సాయి కుమార్ మరియు ఇతర సిబ్బంది సహకారముతో నేరస్థులను పట్టుకోవడము జరిగినది. ఇట్టి నేరస్థులను పట్టుకోవడములో ప్రతిభ కనభర్చిన సిబ్బందిని జిల్లా ఎస్పి ప్రత్యేకముగా అభినంధిచినారు.

MOST READ :

మరిన్ని వార్తలు