తెలంగాణ : నేడు ఇంటర్ పరీక్షల ఫలితాలు..!

తెలంగాణ : నేడు ఇంటర్ పరీక్షల ఫలితాలు..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు నేడు (మంగళవారం )విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఆమె విడుదల చేయనున్నారు.

 

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి నెల 15వ తేదీ నుంచి కాగా ఏప్రిల్ నెల 4వ తేదీ వరకు నిర్వహించారు మొత్తం మొదటి ద్వితీయ సంవత్సరం కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

 

కాగా వారిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల 82 వేల 677 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరం నాలుగు లక్షల 65 వేల 22 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.