వలిగొండ : ట్రాక్టర్ పై నుంచి జారిపడి బాలుడు మృతి

వలిగొండ : ట్రాక్టర్ పై నుంచి జారిపడి బాలుడు మృతి

వలిగొండ, మన సాక్షి:

వలిగొండ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో బాలుడు ట్రాక్టర్ పై నుండి జారిపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే వలిగొండ ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం..

 

తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం చంద్రశేఖర్ రెడ్డి భార్య పిల్లలతో తన స్వగ్రామమైన తుర్కపల్లి నుండి బతుకుదెరువు కోసం పది సంవత్సరాల కిందట మేడ్చల్ మండలంలోని అత్తివెల్లి గ్రామానికి వెళ్లి కాలం వెళ్లదీస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో గత వారం రోజుల క్రిందట పిల్లలతో కలిసి తన స్వగ్రామమైన తుర్కపల్లి కి వచ్చాడు.

 

బద్దం చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు అయినా బద్దం శ్రీకాంత్ రెడ్డి  తన వ్యవసాయ బావి వద్దకు ట్రాక్టర్ ఫై వెళుతూ తన అన్న కుమారులైన ప్రజ్వల్ రెడ్డి ( 9) విజ్వల్ రెడ్డి లను ట్రాక్టర్ కి కుడి పక్కన ప్రజ్వల్ రెడ్డిని ఎడమ పక్కన విజ్వల్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నాడు.

 

మార్గమధ్యలో నోముల శంకరయ్య దొడ్డి వద్ద మూలమలుపు ఉండడంతో అతివేగంగా ట్రాక్టర్ నడపడం వల్ల పెద్ద కుమారుడైన ప్రజ్వల్ రెడ్డి  ఒక్కసారిగా కింద పడిపోయాడు.

 

కింద పడడంతోనే చేయికి కాలుకి శరీరం లోపల బలమైన గాయాలతో ఎడమవైపు పక్కటెముకలు కూడా విరిగాయి. తీవ్ర గాయాలైన ప్రజ్వల్ రెడ్డిని వలిగొండలోని భూపాల్ రెడ్డి హాస్పిటల్ కి తరలించారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు.

 

బాధితులు బద్దం చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పెండ్యాల ప్రభాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామన్నారు.