ట్రాక్టర్ డీ.. ద్విచక్ర వాహనదారుడు మృతి

ట్రాక్టర్ డీ ద్విచక్ర వాహనదారుడు మృతి

దమ్మపేట ,మన సాక్షి ప్రతినిధి :

దమ్మపేట మండల కేంద్రానికి కొద్ది వేటి దూరంలో మల్లారం రోడ్డులో దమ్మపేట నుంచి అప్పారావుపేట వైపుకు ద్విచక్ర వాహనం మీద వెళుతున్న వ్యక్తిని అప్పారావుపేట నుంచి దమ్మపేట వైపు వస్తున్న పామాయిల్ ట్రాక్టర్ డీ కొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు . మృతుడు ములకలపల్లి మండలం సీతయ్య గూడెం పంచాయతీ కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మడివి రవి గా చెప్తున్నారు.

మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నారు. మృతి చెందిన రవి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తాడు. మితిమీరిన వేగంతో తిరిగే వాహనాలకు మలుపులలో చెట్లు పొదలు వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవటం వలన ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు.