Karimnagar : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు కరీంనగర్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!

Karimnagar : గణేష్ నిమజ్జనం సందర్భంగా రేపు కరీంనగర్ లో ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..!
కరీంనగర్, మనసాక్షి:
గణేష్ నిమజ్జనం సందర్భంగా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో (సెప్టెంబర్ 05) శుక్రవారం ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రకటించారు. ప్రజలు, వాహనదారులు ఈ మళ్లింపులకు సహకరించి ప్రయాణ సౌలభ్యాన్ని పాటించాల్సిందిగా కోరారు.
మానకొండూర్ మళ్లింపులు.. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ పల్లె బస్టాండ్ వద్ద నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. ఆ తర్వాత తిమ్మాపూర్ వద్ద రాజీవ్ రోడ్డుకు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లవచ్చని తెలిపారు.
నిమజ్జనం తర్వాత తిరిగి వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో అంటే ముంజంపల్లి, పోరండ్ల మీదుగా తిమ్మాపూర్‌కు చేరుకుని, అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లాలి. కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి మళ్లింపులు ఉండవు.
అవి యథావిధిగా తమ మార్గంలో ప్రయాణించవచ్చు కొత్తపల్లి మళ్లింపులు.. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలను వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్ రోడ్డు, ఎన్టీఆర్ విగ్రహం మీదుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి కరీంనగర్ పట్టణానికి మళ్లిస్తారు.
కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్లే వాహనాలకు అవసరమైనప్పుడు రేకుర్తి జంక్షన్ వద్ద యూనివర్సిటీ ఎక్స్ రోడ్డు, మల్కాపూర్ వైపు మళ్లించి, వెలిచల ఎక్స్ రోడ్డు వద్ద జగిత్యాల రోడ్డుకు చేరుకుంటారు.
నిమజ్జనం పాయింట్ల వద్ద చింతకుంట మరియు కొత్తపల్లి లో నిమజ్జనం తర్వాత, ఈ పాయింట్ల వద్దకు వచ్చిన వాహనాలు యూ టర్న్ తీసుకుని అదే మార్గంలో కరీంనగర్‌కు తిరిగి వెళ్లాలి.
ముఖ్య గమనిక:
సెప్టెంబర్ 05, 2025 నుంచి సెప్టెంబర్ 06, 2025 తేదీ వరకు గ్రానైట్ మరియు ఇతర భారీ సరుకు రవాణా వాహనాలను అనుమతించరు. ఈ నిబంధనలను తప్పక పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
MOST READ :
-
Rusk : రస్క్‌లు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసుకుందాం..!
-
Bandi Sanjay : ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్ కు దోచిపెడతారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!
-
Suryapet : వినాయక నిమజ్జనానికి 1500 మందితో పోలీసు బందోబస్తు..!
-
Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!
-
TG News : తెలంగాణలో రైతులకు భారీ శుభవార్త..!









