ఆధారం ఉంటేనే నగదుతో ప్రయాణం..!

ఆధారం ఉంటేనే నగదుతో ప్రయాణం..!

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

హత్నూర,మన సాక్షి:
అత్యవసరమైతేనే నగదు వెంటతీసుకొని వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలం దౌల్తాబాద్ లోని ఎఫ్ఎస్‌టీ టీంలు చేస్తున్న తనిఖీలను పరిశీలించారు.

అనంతరం చందాపూర్ గ్రామాల్లోని 236 పోలింగ్ స్టేషన్ కేంద్రాలని పరిశీలించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎక్కువ నగదు డబ్బులతో ప్రయాణం చేయవద్దని తెలిపారు. డబ్బులు అత్యవసరమైతే ఆధారాలు వెంట తీసుకొని వెళ్లాలని అన్నారు.

డబ్బులు 50 వేల నుంచి పది లక్షల లోపు నగదు పట్టుబడితే ఐడి ఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ లో సరైన ధృవ పత్రాలు సమర్పించి ఎన్నికలకు సంబంధం లేని ఆధారాలు చూపించి విచారణ అనంతరం తిరిగి పొందవచ్చని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేని నగదు దొరికితే సీజ్ చేయాలని అధికారులకు సూచించారు.

రూ. 10 లక్షల పై నగదు తనిఖీల్లో పట్టుబడితే ఆదాయశాఖకు తెలియజేస్తామని అన్నారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రం వరకు నడవలేని వారి స్థితిలోనూ ఉన్న 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు, ఇంటి నుంచి ఓటు హక్కు సౌకర్యం కల్పించాలన్నారు.

ALSO READ : C Whistle : అక్రమాలపై ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌.. వంద నిమిషాల్లోనే పరిష్కారం..!

పోలింగ్ స్టేషన్ లకు ఓటు వేయాలని ఆసక్తి ఉన్నవారికి పీఎస్ లలో సౌకర్యం సదుపాయాలు కల్పించాలన్నారు. పీఎస్ లలో పీడబ్ల్యూడీ ఓటర్ల కొరకు విల్ చేర్లు ర్యాంపులు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ALSO READ : నల్గొండ : మాడుగులపల్లి నుంచి సినీ ఫక్కిలో పరార్.. వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద కోట్ల కొద్ది కట్టల పట్టివేత..!

వికలాంగులకు సదరన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్నారు. జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ టీం, పీడీ ఆర్డీ, ఏ శ్రీనివాస్, ఫోన్ నెంబర్ 928148100, జిల్లా అడిట్ అధికారి జి రమేష్ ఫోన్ నెంబర్, 9948213828, జిల్లా ట్రెజరీ అధికారి చిన్న సాయిలు నెంబర్ 7799934150, ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో, శ్రీనివాసులు, ఎన్నికల సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.