చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

కనగల్, మన సాక్షి

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన వివాహిత మహిళ మండలి అరుణ (35) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందింది. కనగల్ ఎస్సై యు. నగేష్ తెలిపిన వివరాల ప్రకారం…

 

ఎస్. లింగోటం పరిధి మైలారం కు చెందిన అరుణ భర్త శ్రీశైలం కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. భూమి పట్టా విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరగగా మనస్థాపం చెంది క్షణికావేశంలో అరుణ ఈనెల 8న పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

 

మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. మృతురాలి తమ్ముడు లింగస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.