విద్యుదాఘాతం తో గిరిజన రైతు మృతి..!
విద్యుదాఘాతం తో గిరిజన రైతు మృతి..!
మంగపేట, మన సాక్షి ;
రబీ పంట నాటు కోసం త్రీ ఫేజ్ మోటారుకు అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చేందుకు ట్రాన్స్ ఫారం వద్దకు వెళ్లగా ఎల్టీ లైన్ కు వైరు తగిలించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై గిరిజన యువ రైతు జవ్వాజీ రామకృష్ణ (35) చేనులో పడి అక్కడిక అక్కడికి మృతి చెందిన ఘటన మండలంలోని కోమటిపల్లి బుర్కాబందల (కట్టుకాల్వ) ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోమటిపల్లి ఎస్టి కాలనీకి చెందిన రామకృష్ణ తన పంట పొలంలో రబీ నాటు వేసేందుకు పొలానికి నీరు పెట్టడానికి ఉదయం వచ్చాడు ఈ క్రమంలో మోటర్కు కరెంటు రాకపోవడంతో సమీపంలోని ట్రాన్స్ఫారం ఎల్టీ లైనుకు మోటర్ వైర్లు తగిలించే క్రమంలో 11/33 కేవీ లైన్ ఎర్త్ కు విద్యుత్ సరఫరా జరిగి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
విషయాన్ని పోలీసులకు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు మృతుడికి భార్య పుష్పలత ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విషయం మంగపేట లైన్ ఇన్స్పెక్టర్ మధును వివరణ కోరగా మృతుడు చనిపోయినట్లు సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించామని తెలిపారు.
వైర్లు తగిలించ క్రమంలోని విద్యుత్ ఘాతానికి గురైనట్లు గుర్తించినట్లు తెలిపారు రైతుల అగ్రికల్చర్ మోటార్లకు వైర్లు తగిలించేటప్పుడు తమను సంప్రదించి ఎల్సి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
LATEST NEWS ;
-
Wonder Girl : అతి చిన్న వయసులోనే ఇండియన్ గర్ల్ కార్తికేయన్ ప్రపంచ రికార్డ్.. 16ఏళ్ళ వయసులోనే 7 ఎత్తైన పర్వతాలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై మరో కీలక నిర్ణయం.. ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
2024 Google Top Search in India : 2024 గూగుల్లో ఎక్కువ ఏం వెతికారో తెలుసా.. తెలిస్తే షాక్..!
-
Rythu Bharosa : రైతు భరోసా వారికి మాత్రమే.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : తెలంగాణలో మందు బాబులకు అదిరిపోయే శుభవార్త..!









