Breaking NewsTOP STORIESజాతీయం

Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి రోజుకు ఎన్నో కాల్స్ వస్తుంటాయి. కొన్ని నెంబర్లు ఫోన్ కాంటాక్ట్ లో లేనివి కూడా వస్తుంటాయి. కొత్త కొత్త వారు ఫోన్ చేస్తుంటారు. ఎవరు ఫోన్ చేశారో తెలుసుకోవాలంటే చాలా ఈజీ అనుకంటున్నాము. అలా అని ట్రూకాలర్ ను మనం వాడుతున్నాము. అయితే ట్రూ కాలర్ లో కూడా పేరు నమోదు చేసిందే మనకు డిస్ ప్లే అవుతుంది. కానీ వారి ఒరిజినల్ పేరు డిస్ ప్లే కాదు.

కొత్త నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆటోమెటిక్ గా ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో..? ఆ పేరు డిస్ ప్లే కనిపించనున్నది. భారత ప్రభుత్వం మన సేఫ్టీ కోసమే ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చే పనిలో ఉంది. అయితే అందులో భాగంగా కొన్ని సర్కిల్స్ లో ఈ కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తున్నారు.

తమకు వచ్చే కొత్త నెంబర్ ఎవరిదో అని తెలుసుకోవడానికి ట్రూ కాలర్ తో ఇక పనిలేదు. ట్రూ కాలర్లో వారు ఎలా సేవ్ చేసుకుంటే అలానే వస్తుంది. కానీ ప్రభుత్వం తీసుకురానున్న CNAP (కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్) కాలర్ ఆధారంగా ఆధార్ తో లింక్ అయిన పేరు మాత్రమే చూపిస్తుంది.

అయితే ప్రభుత్వం గత నెలలో CNAP పోర్టల్ ఆమోదించింది. టెలికం ఆపరేటర్లు ఇప్పుడు ఎంపిక చేసిన సర్కిళ్లలో దీనిని టెస్ట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మనం కొనుగోలు చేసిన సమయంలో ఏ ఆధార్ కార్డు పేరుతో తీసుకుంటారో అందులో ఆ పేరు డిస్ ప్లే అవుతుంది.

ఒకవేళ మీ మొబైల్ నెంబర్ లో ఆ నెంబర్ సేవ్ ఆయ్యి ఉన్నా.. కూడా ఆధార్ లో ఉన్న పేరు వచ్చిన తర్వాత మీరు సేవ్ చేసుకున్న పేరు కనిపిస్తుంది. ఈ ఫీచర్ వల్ల స్కామ్స్, మోసగాళ్ల కాల్స్ విషయంలో థర్డ్ పార్టీ యాప్ ల పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొని ప్రాంతాల్లో ఇది ఫీచర్ అందుబాటులో ఉంది. టెస్ట్ పూర్తయ్యాక పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.

MOST READ :

  1. Bandi Sanjay : పంచాయతీ ఎన్నికల నేపథ్యం.. గ్రామాల అభివృద్ధికి బండి సంజయ్ బంపర్ ఆఫర్..!

  2. TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!

  3. Miryalaguda : మహిళా సంఘాలకు రూ.10.10 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా కు వేళాయే.. రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు