TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
TSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్.. టి – 24 టికెట్..!
హైదరాబాద్ , మనసాక్షి :
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇప్పటికే అనేక ప్రత్యేక రాయితీలు ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కూడా మరో ప్రత్యేక రాయితీని ప్రకటించింది.
24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ – 24 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రాయితీ ఆగస్టు 15వ తేదీన అందిస్తుంది. ఈ రాయితీ హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజనులకు కూడా రాయితీ ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ – 24 టికెట్ కేవలం 75 రూపాయలకే అందించనుంది. పిల్లలకు టీ 24 టికెట్ ను 50 రూపాయలకే అందించనుంది. ఈ రాయితీ కేవలం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన మంగళవారం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది
ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి- 24 టికెట్ 120 రూపాయలకు అందిస్తుండగా, మహిళలు, సీనియర్ సిటిజనులకు 100 రూపాయలు, 12 సంవత్సరాల లోపు పిల్లలకు 80 రూపాయలుగా తీసుకుంటున్నారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ సందర్భంగా టి -24 కేవలం 75 రూపాయలకు, పిల్లలకు 50 రూపాయలకే అందించనున్నది.
అదేవిధంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజనులకు టికెట్ చార్జీలలో 50% రాయితీ ప్రకటించింది. 60 సంవత్సరాలు దాటిన స్త్రీ , పురుషులు 50% రాయితీ కోసం ప్రయాణించే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కు ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో పర్యాటక ప్రాంతాలు, పార్కులు సందర్శించేందుకుగాను T -24 టికెట్ పై రాయితీని ప్రకటించారు.
పర్యాటక ప్రాంతాల సందర్శనకు :
హైదరాబాద్ సిటీ బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణికులకు టిఎస్ఆర్టిసి అనేక ప్రత్యేక రాయితీలు కల్పిస్తుంది. దాంతో ప్రయాణికుల మన్ననలు పొందుతుంది. ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్షించేందుకు అనేక రాయితీలు ప్రకటిస్తుంది. సెలవు రోజులలో కూడా ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు ప్రయాణికులకు హైదరాబాద్ నగరంలో సెలవు రోజు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకుగాను ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకువచ్చింది.
స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ కు స్పందన :
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి టి – 24 టికెట్ పై ప్రకటించిన ఆఫర్ కు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక రాయితీ ఉపయోగించి నగరంలో అనేకమంది పార్కులు , పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. టి 24 టికెట్ పై ప్రయాణించేందుకు నగర ప్రజలు ఉత్సాహం చూపే అవకాశం ఉంది.
MOST READ :
- TSPSC : టి ఎస్ పి ఎస్ సి గ్రూప్ -2 పరీక్ష తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే..!
- Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!
- Google Crome : గూగుల్ క్రోమ్ అప్ డేట్ చేసుకోకుంటే ముప్పు తప్పదు.. ఇలా చేసుకోండి..!
- వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!










