Miryalaguda : దామరచర్ల చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..!
Miryalaguda : దామరచర్ల చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..!
మిర్యాలగూడ (దామరచర్ల) మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండల కేంద్రంలో చెరువులో ఇద్దరు చిన్నారులు మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రం కు చెందిన నాగరాజు పెద్ద కుమారుడు నాగ ధనుష్ (11) ఆయన మరదలు కుమారుడు పెద్ది శెట్టి సాత్విక్ (8) వీరు మరికొంతమంది చిన్నారులతో కలిసి గ్రామ శివారులోని నాగుల చెరువు వద్దకు వెళ్లారు.
చెరువులో నీరు కొద్దిగా ఉందని భావించిన ఆ చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగారు. వీరిద్దరూ చెరువులో మునిగిపోతుండగా అక్కడున్న వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ నీటిలో మునిగి ధనుష్ చనిపోయాడు. సాత్విక్ కొనఊపిరితో ఉండగా మిర్యాలగూడకు తరలించి చికిత్స పొందుతుండగా మృతి చెందాడు. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
Nalgonda : నల్గొండ జిల్లాలో తూనికల అధికారులు విస్తృత దాడులు.. 12 కేసులు నమోదు..!
డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!









